Site icon NTV Telugu

Minister Narayana: మున్సిపల్ శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

Minister Narayana

Minister Narayana

Minister Narayana: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు.. వేస్ట్ మేనేజ్‌మెంట్‌, డ్రైనేజ్.. ప్రజలకు ముఖ్యం.. కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తున్నాయి.. స్వచ్ఛ భారత్ కు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు అమృత్ స్కీం ముందుకు తీసుకువెళ్లే విధంగా టెండర్లు పిలిచాం.. రాష్ట్రంలో 80 శాతం ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.. సీఎం చంద్రబాబు.. ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.. డ్రైనేజ్ వాటర్ ను శుద్ధి చేసి బయటకు పంపించాలి.. దీనికి సంబంధించి కూడా కార్యాచరణ రెడీ అవుతోందన్నారు..

Read Also: Pakeeza : ఏపీ సీఎం, డిప్యూటి సీఎం కాళ్ళు పట్టుకుంటా.. ఆదుకోండి!

అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి.. విశాఖ, గుంటూరులో 1400 టన్నుల చెత్త నుంచి విద్యుత్‌ వస్తోందని తెలిపారు మంత్రి నారాయణ.. విజయవాడ, రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ విషయంలో త్వరలో టెండర్లు పిలుస్తున్నాం అన్నారు.. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా చర్చ జరిగింది. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ఇవ్వలేదు.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల 140 కోట్ల బ్యాంక్‌ రుణాలు కట్టి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు.. మరోవైపు, మున్సిపల్ కార్మికుల సమస్యపై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.. మున్సిపల్ కార్మికుల సమస్యపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామన్నారు.. అప్కాస్ పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చిస్తుందన్నారు మంత్రి నారాయణ..

Exit mobile version