NTV Telugu Site icon

Minister Nara Lokesh: రెడ్‌ బుక్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు.. ఆ ఆలోచన వద్దు..!

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీని విమర్శిస్తోంది.. అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తుందన్నారు.. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ అయ్యిందన్నారు.. అయితే, ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన మాత్రం వద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్‌..

Read Also: Janasena Foundation Day Celebrations: హైదరాబాద్‌లో సమావేశమైన జనసేన నేతలు.. విషయం ఇదే..!

ఇక, ఈవీఎం అయినా బ్యాలెట్ అయిన గెలుపు కూటమిదే అన్నారు లోకేష్.. 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు 9 నెలల పాలనలో సీఎం చంద్రబాబు విజయం సాధించారు.. భారీ మెజారిటీతో గెలిస్తేనే గెలుపు అని నేను ఆనాడే చెప్పాను.. ఇంకో ఇద్దరు నాయకులు మండలికి వస్తున్నారు. కౌన్సిల్ లో ఉన్న మొత్తం 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు గాను అన్నింటినీ టీడీపీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం కష్టపడిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు, నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే వన్ డే ఎమ్మెల్యే.. డిపాజిట్ రాదని కనీసం పోటీకి కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు.. జగన్ చేస్తున్న పనులకు, కొత్త పేరు పెట్టాం.. “వన్ డే ఎమ్మెల్యే”.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం, ఒక రోజు అసెంబ్లీకి వచ్చి హడావిడి చేసి బెంగళూరు పారిపోతాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి నారా లోకేష్.