NTV Telugu Site icon

Minister Nara Lokesh: డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించిన లోకేష్‌.. ఏమన్నారంటే..?

Lokesh Nara

Lokesh Nara

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం అంశం పొలిటికల్‌ హీట్‌ పుట్టించింది.. ముఖ్యంగా కూటమి పార్టీలోనే కాక రాజేసింది.. సీఎం చంద్రబాబు సమక్షంలో కడప జిల్లా అధ్యక్షుడు.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని ప్రస్తావించగా.. ఆ తర్వాత క్రమంగా పార్టీలో కొందరు కీలక నేతలు కూడా.. లోకేష్‌ సమర్థుడే.. డిప్యూటీ సీఎంను చేయాల్సిందే.. పార్టీ ఫ్యూచర్‌ ఆయనే.. కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అంటూ కామెంట్లు చేశారు.. అయితే, ఇటు టీడీపీతో పాటు.. అటు జనసేన కూడా ఈ అంశంపై ఎలాంటి కామెంట్లు చేయొద్దంటూ తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశాయి.. ఇక, తొలిసారి డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించారు నారా లోకేష్..

Read Also: Greenland: ‘‘మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు’’.. ట్రంప్‌కి షాక్..

దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు అవుతూ.. పెట్టుబడులతో రండి అంటూ ఆహ్వానిస్తున్నారు.. ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్‌ను పలకరించింది ఓ జాతీయ మీడియా ఛానల్‌.. ఈ మధ్య ఏపీలోని లోకల్ మీడియాలో లోకేష్‌ డిప్యూటీ సీఎం అనే వార్తలు వస్తున్నాయి.. మీ రాజకీయ ఆశయం ఏంటి? అని మీడియా ప్రతినిధి లోకేష్‌ను ప్రశ్నించారు.. ఇక, ఆ ప్రశ్నకు స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. తాను రాజకీయంగా సెటిల్‌గా ఉన్నాను.. ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు.. 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు.. ఇక, నాకు ప్రస్తుతం చేతి నిండా పని ఉంది.. నాపై బాధ్యత కూడా ఉంది అన్నారు.. తనకు అప్పగించిన శాఖలపై పనిచేస్తున్నాను.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైంది.. ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన టార్గెట్‌లపై పనిచేస్తున్నట్టు వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌..

Read Also: HCA: ఆర్చర్‌ చికితకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌ రావు చేయూత..

కాగా, నిన్న లోకేష్‌ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ.. ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ.. టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఇక, ఈ రోజు డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు.. ఈ అంశంపై మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ ఎవరూ స్పందించవద్దు.. ఎలాంటి కామెంట్లు చేయొద్దు అంటూ జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశించిన విషయం తెలిసిందే..