Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nara Lokesh Met Perot Group And Hillwood Development Chairman Ross Perot Jr Invitation To Invest In Andhra Pradesh

Minister Nara Lokesh in US: ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలం.. ఏవియేషన్‌లో పెట్టుబడులు పెట్టండి

Published Date :October 28, 2024 , 12:25 pm
By Sudhakar Ravula
  • అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీబిజీ..
  • డల్లాస్ లో పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ తోభేటీ..
  • మీ ప్రాజెక్టులకు ఏపీ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి..
Minister Nara Lokesh in US: ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలం.. ఏవియేషన్‌లో పెట్టుబడులు పెట్టండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nara Lokesh in US: అమెరికాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ సంస్థలు.. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు అవుతూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, డల్లాస్ లోని పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తోభేటీ అయ్యారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ అండ్‌ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి. విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. మా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి అని కోరారు..

Read Also: Mirzapur : సినిమాగా వస్తున్న మీర్జాపూర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఇక, విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం ఉంది. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రదేశం. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి మీ వంటి అనుభవజ్ఞుల నైపుణ్యం మాకు ఉపయోగపడుతుందన్నారు మంత్రి లోకేష్. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పీపీపీ ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ పెరోట్ జూనియర్ ను కోరారు. మంత్రి లోకేష్ వెంట బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు. కాగా, పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు. అలయన్స్ టెక్సాస్‌తో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విజయవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెరోట్ కీలక భూమిక వహించారు. 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేయడంలో రాస్ పెరోట్ జూనియర్ విశేషమైన గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ఏవియేషన్‌ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికాలో బిలియన్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. తన ప్రాజెక్ట్‌లలో అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష ఆవిష్కరణలతో పెరోట్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Hillwood Development Chairman Ross Perot
  • Invest
  • Minister Nara Lokesh
  • Minister Nara Lokesh in US

తాజావార్తలు

  • Vijay Mallya: “నాడు రూ. 450 కోట్లకు కొంటే నవ్వారు.. నేడు గర్వంగా ఉంది!”.. RCB అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్!

  • Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!

  • Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

  • Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

  • Faf du Plessis: “వాళ్లకు గంభీర్ ఒక విలన్‌లా కనిపిస్తాడు”.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions