Minister Nara Lokesh: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దు.. లోకేష్ కీలక సూచనలు
- మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయి..
- పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దు..
- ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఆ కోటాలో పదవి పొందేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు సాగించారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ని కలిసి.. విన్నవించుకున్నారు.. అయితే, ఉన్నది ఐదు సీట్లు మాత్రమే.. అందులో జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించిన తర్వాత.. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. దీంతో, కొన్ని ప్రాంతాల్లో ఆందోళన జరిగినట్టు తెలుస్తోంది.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. పార్టీ అధినేతపై నమ్మకాన్ని ప్రకటిస్తారు.. ఈ తరుణంలో.. మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్..
Read Also: CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష
Also Read
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.. మరోవైపు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయి అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దు అని సూచించారు. ఇక, టీచర్ల సమస్యలను క్రమపద్దతిలో పరిష్కరించాం. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యల పరిష్కరించామని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, అసెంబ్లీ కమిటీ హాల్ లో నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర.. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
-
Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
-
Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
-
KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
-
Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!