Site icon NTV Telugu

Minister Nara Lokesh: అర్థమైందా రాజా..? మంత్రి లోకేష్ కౌంటర్‌ ట్వీట్..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఏపీలో కేసులు, అరెస్ట్‌ల పర్వం ఓవైపు.. నిరసన కార్యక్రమాలు మరోవైపు.. సోషల్‌ మీడియా వార్‌ ఇంకో వైపు కాకరేపుతోంది.. ఏపీలోని కూటమి సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేస్తే.. ఎక్స్ (ట్విట్టర్‌)లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. జగన్ గారు మీ కపటత్వానికి నాకు నవ్వు వస్తోందన్న ఆయన.. “నాకు కాలేజీ లైఫ్ ఉంది.. మీకు జైలు జీవితం ఉంది”.. “నాకు క్లాస్‌మెట్స్ ఉన్నారు… మీకు జైలుమెట్లు ఉన్నారు..” అర్థమైందా రాజా? అంటూ గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.. ముఖ్యమంత్రిగా మీ ఐదేళ్ల పదవీకాలం రాజకీయ ప్రతీకార చర్యలకు వేదికగా అభివర్ణించారు లోకేష్‌.. మహిళలు, దళిత మహిళలపై అనేక దాస్టికాలకు మీ పదవీకాలం నిదర్శనమని పేర్కొన్న ఆయన.. నాడు మీడియాలో వాటిని దాచిపుచ్చారు.. నాడు ఎవరు గళం ఎత్తిన, వారిపై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యాంగా మార్చారని దుయ్యబట్టారు.. మీ కాలంలో జరిగిన దుశ్చర్యలకు మమ్మల్ని బాధ్యులు చేయాలనుకోవడం.. ఇంకా కవర్ చేసుకోవాలనుకోవడం మానుకోండి అంటూ ట్వీట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version