NTV Telugu Site icon

Minister Nara Lokesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నాం..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్‌.. గత ప్రభుత్వ హయాంలో తరిమేసిన అన్ని పరిశ్రమలను మళ్లీ తీసుకొస్తాం అన్నారు.. టీసీఎస్‌ను తామే ఏపీకి తీసుకొచ్చామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు నారా లోకేష్‌.. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయి అన్నారు.. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు.. బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు..

Read Also: Shakib Al Hasan: ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నా: షకిబ్

వరదలొస్తే జగన్ లా పరదాలు కట్టుకుని చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదు అన్నారు లోకేష్.. వైఎస్‌ జగన్ కి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది అంటూ సెటైర్లు వేసిన ఆయన.. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అంటున్నారు.. ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారు? అని ఎద్దేవా చేశారు.. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నాం.. లూలూ, అశోక్ లైల్యాండ్ లే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.. ఇక, రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది.. చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్ల మీద కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు.. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కి రెడ్ బుక్ లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉంది.. యాక్షన్ అయితే అనివార్యం.. వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదు.. కానీ, నా నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యారని అర్థమైందని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌..

Show comments