NTV Telugu Site icon

Pawan Kalyan: సినీ హీరోలపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల

Nadendla Manohar

Nadendla Manohar

Pawan Kalyan: బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సినిమాలలో పాత్రల మీద పవన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నారు.. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డీఎఫ్‌వోగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని పేర్కొన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ కల్యాణ్ ఆలోచనగా స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. మరోవైపు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? అని ప్రశ్నించారు.. జగన్ కు ఇంకిత జ్ఞానం ఉండాలి అంటూ ఎద్దేవా చేశారు. మేం సరిగ్గా పరిపాలన కొనసాగిస్తున్నాం.. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల పై మాట్లాడాలి.. తనకు సమస్యలు ఉన్నాయని.. మాట్లాడటం జగన్ మార్చుకోవాలి అని హితవుపలికారు.. ప్రతిపక్ష హోదా పక్కన పెట్టండి.. తాడు బొంగరం లేని పార్టీ.. వైసీపీ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పటికీ ఈసీ రికార్డుల్లో పార్టీకి ఎవరు అధ్యక్షులో క్లారిటీ లేదన్నారు.. జనసేనకు లోక్ సభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు.. ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తారు.. రాష్ట్రంలో గత పరిపాలనలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం కలిగించింది.. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి సహకరించాలని, భరోసా ఇవ్వాలనే భావన వాళ్లలో కనిపిస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.

Show comments