AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు.. జల్ జీవన్ మిషన్ పథకం అమలు జరగకపోవడం గత ప్రభుత్వం చేసిన నష్టానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. లక్ష నుంచి లక్షన్నరకి ప్రతిపాదనలు పంపించాయి కేరళ లాంటి చిన్న రాష్ట్రాలు సైతం జలజీవన్ మిషన్ కి.. కానీ, పరిశుభ్రమైన నీటికి లక్షలాది ప్రజలు దూరమయ్యారని తెలిపారు.. అయితే, 25 శాతం కంటే తక్కువ పనులు 11,400 కోట్లు.. వాటికి రీటెండరింగ్ జరుగుతుంది.. వాటికి కేబినెట్ అనుమతి మంజూరు చేసిందన్నారు.. డోన్, ఉత్థానం, పులివెందులలో పనులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది.. స్థిరమైన నీటి వనరులు వినియోగం ద్వారా త్రాగునీటి వసతి ఇవ్వాలన్నది జల్ జీవన్ మిషన్ ఉద్దేశం అన్నారు..
Read Also: Bird Flu: మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ గుర్తింపు..
ఇక, ఇప్పటి వరకూ డోలాయమానంలో ఉన్న అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు ఇచ్చాయి.. 45 ఇంజనీరింగ్ పనులు 33,137 కోట్లతో పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. గ్రామకంఠ భూముల సర్వే, రికార్డింగ్ లో 48,899 సబ్ డివిజన్ చేయడానికి అర్జీలు వచ్చాయి.. వాటికి ఫీజు రాయితీ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నా యన.. వరదల్లో ముంపుకు గురైనవారి రుణాలపై యూజర్ ఛార్జీలు ఎత్తివేయడానికి, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. మార్క్ ఫెడ్ కు 1000 కోట్ల అదనపు రుణాన్ని పొందేందుకు ఆమోదం లభించింది.. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీడెండరింగ్ కు కేబినెట్ ఆమోదించింది.. హంద్రీనీవా కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ కు పాత రేట్ల ప్రకారమే చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 1.06 లక్షల ఉపాధి అవకాశాలు ఈ జాయింట్ వెంచర్ ద్వారా వస్తాయన్నారు..
Read Also: Heavy Rains in Andhra Pradesh: ఏపీలో విస్తారంగా వానలు.. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
మరోవైపు.. ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించనున్నాం.. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, కేజీబీవీల్లో ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి.. ఈ పథకాన్ని పునరుద్ధరించడం వల్ల 1.4 లక్షల మంది విద్యార్థులు ఉపయోగపడుతుందన్నారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. ప్రభుత్వ కాలేజీలలో సైతం జేఈఈ వంటి పరీక్షలకు కావాల్సి ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..