NTV Telugu Site icon

Minister Atchannaidu: చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత..

Minister Atchannaidu

Minister Atchannaidu

Minister Atchannaidu: చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన.. టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలన్నారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు..

Read Also: Devara: దేవర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ దర్శకుని కుమారుడు.. ఎవరంటే..?

రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు.. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలం. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ఆప్కాబ్ – డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈరోజు ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాను. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ – ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.