Site icon NTV Telugu

Minister Dola Bala Veeranjaneya Swamy: వైసీపీపై మంత్రి ఫైర్.. రికార్డులు కావాలన్నా ఇస్తాం..!

Minister Dola

Minister Dola

Minister Dola Bala Veeranjaneya Swamy: అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు.. గత ప్రభుత్వ బకాయిలు తీర్చే పనిలో ఉన్నామన్నారు.. మీ హయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు కూడా రాయకుండా ఆగిపోయారన్నారు.. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరంటూ వైసీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు..

Read Also: Revenue Sadassulu: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..

ఇక, విద్యుత్ చార్జీల భారం పడటానికి గతంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్ లే కారణం కాదా..? అని నిలదీశారు మంత్రి వీరాంజనేయస్వామి.. మీ పాపాలనే తాము మోస్తున్నాం తప్ప వేరొకటి కాదన్నారు.. అసలు అప్పుడు ఎందుకు ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారో బయటపెట్టాలన్నారు.. దారుణంగా ఇతరుల ఆస్తులను లాక్కున్నారని.. రెవెన్యూ కుంభకోణంలో త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.. మరోవైపు కమీషన్ల గురించి, అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్‌ ఇచ్చారు.. ఇక, దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు, దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు వైసీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. జగన్ భ్రమల్లో విహరించడం మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని లేకుంటే పూర్తిగా పతనమవుతారని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించిన విషయం విదితమే..

Exit mobile version