Anagani Satya Prasad: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో కలపడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పీల్చి పిప్పి చేసి.. వారి సబ్ ప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్ రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు..
Read Also: Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
ఇక, జగన్ రెడ్డి.. కంపెనీలను బెదిరించి రాష్ర్టం నుండి వెళ్ల గొట్టి ఏపీ పరువును అంతర్జాతీయంగానూ తీసిన విషయం లూలూ, కియా కంపెనీల ఉదాంతాలే తెలుపుతున్నాయని వ్యాఖ్యానించారు మంత్రి అనగాని… అయితే, ఏపీ బ్రాండ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పున: నిర్మిస్తుండగా.. మరోవైపు వైఎస్ జగన్ అలవాటు ప్రకారం అమరావతిపై విషం కక్కుతున్నాడని ఆరోపించారు.. సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవని జగన్.. ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే అది నమ్మేస్థితిలేకే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..