NTV Telugu Site icon

Minister Anagani Satya Prasad: రెవెన్యూ సదస్సుకు అపూర్వ స్పందన.. ఇప్పటి వరకు 1.80 లక్షల అర్జీలు

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేకంగా రెవన్యూ సదస్సులు నిర్వహిస్తోంది.. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. డిసెంబర్‌ 6వ తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. అయితే, ఈ సదస్సుల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.. సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు..

Read Also: Anna University Case: లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..

ఇక, ఇప్పటి వరకు లక్షా 80 వేల అర్జీలు వచ్చాయని తెలిపారు మంత్రి అనగాని.. వాటిలో 13 వేల ఫిర్యాదులకు అక్కడిక్కడే పరిష్కారం లభించిందన్నారు.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరై తమ సమస్యలను చెప్పుకున్నారు.. ఆర్ ఓ ఆర్ లో తప్పులపై లక్షకుపైగా ఫిర్యాదులు రాగా.. భూమి సరిహద్దు సమస్యలపై 18 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.. రీసర్వే సమస్యలపై 11 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి.. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు ఇచ్చారు.. 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు వచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

Show comments