Minister Achchennaidu: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమగ్రంగా చర్చించారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచనలు ఇచ్చారు. ఇక, సహాయక చర్యల్లో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 24 గంటలూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి వరదల పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also: PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
మరోవైపు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. పలుచోట్ల
కాజ్వేలపైకి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే పైకి వరద నీరు చేరుకుంది. అలాగే, వరద పెరుగుతున్న కూడా లైఫ్ జాకెట్లు లేకుండానే స్థానిక ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. లైఫ్ జాకెట్లు లేకుండా పడవలపై ఎక్కించుకోవద్దని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
