Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు
- బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి చట్ట సవరణ బిల్లుతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదని వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాజధాని అమరావతి చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చ సందర్భంగా మిధున్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ‘చట్ట సవరణ బిల్లు’ ప్రజలకు ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని.. చట్ట సవరణ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన చట్టం సవరణ బిల్లు స్వరూపం సరైందిగా లేదని… అందుకే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
‘‘అమరావతి కోసం 33 వేల మంది రైతులు భూమిలిచ్చారు. భూమిలిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. తనకు ప్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల గురించి పట్టింపు లేదు. అమరావతి అనే పేరు మాత్రమే కాదు.. రైతులకు ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. రాజధాని నిర్ణయం రాష్ట్రం ఇష్టమని గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి మాట్లాడితే బాగుండేది. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది.’’ అని మిధున్‌రెడ్డి ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా మిధున్ రెడ్డి వెల్లడించారు. దీంతో వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!