Medical College Tenders: హాట్ టాపిక్ గానే మెడికల్ కాలేజీల వ్యవహారం.. టెండర్లు రాకపోవడానికి కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical College Tenders: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం. హాట్ టాపిక్ గా మారింది … ఏపీలో నాలుగు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి టెండర్లు పిలిచారు.. అయితే, కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే బిడ్ దాఖలు అయ్యింది.. అది కూడా ఆదోనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్ వేశారు.. మిగిలిన మూడు మెడికల్ కాలేజీలకు ఎలాంటి టెండర్ లు రాలేదు… మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ ప్రాంతాల్లో కనీసం ఒక్క టెండర్ కూడా నమోదు కాకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
Read Also: ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
మరోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా తాము.. అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతామంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్‌ల వల్లే.. బెదిరింపుల కారణంగా… టెండర్లు ప్రక్రియ నిలిచిపోయిందని స్వయంగా మంత్రి సత్యకుమర్ చెబుతున్నారు. మెడికల్ కాలేజ్ టెండర్లు మూడు కాలేజీలకు రాకపోవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు.. జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే టెండర్లు రాలేదు అన్నారు.. వ్యక్తిగతంగా కూడా బెదిరింపులకు దిగారని అన్నారు.
ఇక్కడే…. అసలు చర్చ మొదలైంది.. ఒక ప్రతిపక్ష నాయకుడు అందులో 11 సీట్లు ఉన్న.. ప్రతిపక్ష నాయకుడు బెదిరిస్తే.. బెదిరిపోయి.. టెండర్లు రాకపోతే.. రేపు భవిష్యత్తులో పీపీపీ మోడల్ లో కట్టే మిగిలిన నిర్మాణాల పరిస్థితి ఏంటి అనే చర్చ ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదీ పీపీపీ మోడల్ లో ప్రారంభించడానికి ముందుకెళ్తోంది.. రోడ్డు నిర్మాణం కావచ్చు.. ఇతర నిర్మాణాలు కావచ్చు.. మెడికల్ కాలేజీలు కావచ్చు.. ప్రతి అంశం మీద ప్రత్యేకంగా పీపీపీపై దృష్టి పెట్టింది.. ప్రస్తుతం ప్రభుత్వమే జగన్ బెదిరింపులు వల్ల మెడికల్ కాలేజీలకు టెండర్లు రాలేదని చెప్తే ఇక భవిష్యత్తులో మిగిలిన కట్టడాలు కానీ.. నిర్మాణాలు కానీ.. ఏ రకంగా చేస్తారు అనే చర్చ జరుగుతోంది..
కేవలం నాలుగే నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తేనే ఒక కాలేజీకి టెండర్ వచ్చి మిగిలిన మూడు కాలేజీలకు టెండర్లు రాకపోతే… భవిష్యత్తు పరిణామాలు ఏ రకంగా ఉంటాయనే.. చర్చ ప్రధానంగా జరుగుతోంది.. మంత్రి సత్య కుమార్ దీన్ని ధృవీకరించడం .. సీఎం చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని మాట్లాడటం ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. ప్రభుత్వం ఒకపక్క అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నా.. పీపీపీ మోడల్ లో.. కొన్ని నిర్మాణాలకు సంబంధించి ముందుకు వెళ్తోంది.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్… అని పీపీపీ మోడ్‌లో కట్టే మెడికల్ కాలేజీలపై విమర్శలు చేస్తూ ఉన్నారు… అన్ని స్కామ్ లకు.. ఇదే మూలం అని… అధికారంలోకి వస్తే జైల్లో పెడతాను అని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు.. ఇదే పరిస్థితి కొనసాగితే… మరి భవిష్యత్తులో ఇవే పరిణామాలు కొనసాగుతాయా..? ప్రభుత్వం ఏమైనా.. చర్యలు తీస్కుంటుందా…? అనేది చూడాలి.. కూటమి నేతల్లో మాత్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!