NTV Telugu Site icon

CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..

Babu

Babu

CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాం.. అన్ని మతాల వారి మత పూజలు, ప్రార్ధనలు చేస్తారు.. అలాగే మన రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని స్పష్టం చేశారు.. వినూత్న భావనతో ఆలోచించడం మానేశాం.. చాలా దశాబ్దాలు మనం ఆధారపడే వారుగానే ఆలోచించాం.. రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు నుంచీ రాజ్యాంగం రచించుకున్నాం.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలు చదివారు‌.. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించి రచించారు. 299 మంది విశిష్ఠ వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Old Bridge Collapse: కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..

పదకొండు మంది ఏపీ నుంచీ రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషం అన్నారు సీఎం చంద్రబాబు.. ఏపీలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన వారికి కూడా నివాళులర్పించాలి.. సాంఘిక ఆర్దిక రాజకీయ న్యాయాన్ని మనం నేర్చుకోవాలి.. అవకాశాల్లో సమానత్వం మనం కచ్చితంగా అనుసరించాలి.. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు.. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరువేసుకునే పరిస్ధితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..