NTV Telugu Site icon

CID Investigation: కాసేపట్లో ముగియనున్న లోకేష్ సీఐడీ విచారణ

Lokesh

Lokesh

CID Investigation: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉదయం నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి నారా లోకేష్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. లోకేశ్ పై ఈ కేసులో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు మధ్యాహ్నం గంట లంచ్ బ్రేక్ ఇవ్వగా.. అనంతరం మళ్లీ విచారించారు.

Read Also: Bathukamma festival : బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనక దాగున్న రహస్యం ఇదే..

ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ఏ-14 గా ఉన్నారు. ఈ కేసులో అలైన్ మెంట్ లో మార్పు ముందస్తు సమాచారం, హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు వ్యవహారం, లోకేష్ పాత్ర పై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సార్లు అలైన్ మెంట్ మార్చి లబ్ది పొందటం వంటి పలు అంశాలపై సీఐడీ ప్రశ్నిస్తుంది. లోకేశ్ కు 41ఏ నోటీసు ఇచ్చి విచారిస్తుంది. ఈ క్రమంలో లోకేశ్ విచారణ మరికాసేపట్లో ముగియనున్నట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం.. లోకేష్ సీఐడీ ఆఫీసు నుండి నేరుగా కరకట్ట నివాసానికి వెళ్లనున్నారు. అయితే ఆయన బయటకు వస్తున్న నేపథ్యంలో సీఐడీ ఆఫీసు దగ్గరకు టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.

Read Also: Nakka Anandbabu: చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనం