Minister Anagani Satya Prasad: గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూశాఖ పని తీరు.. భూ పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూమి సెంటిమెంట్ అర్ధం చేసుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.. గ్రామాల్లో చాలా భూములు వివాదాల్లో ఉంటాయి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువ గల భూమిని… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. పేదల ఇల్లు… జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు అవుతుందన్నారు.
Read Also: HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
చెయ్యలేని భూ సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆధార్ లింక్.. సర్వే నెంబర్ లింక్ తో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు మంత్రి అనగాని.. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది. అక్టోబర్ 2కి ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. గత పరిపాలకులు చేసిన పొరబాట్ల కారణంగా భూముల యజమానుల ఎంట్రీస్ అలసత్వాలు జరిగాయి.. రెవెన్యూలో ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం.. మదనపల్లి ఘటన నుంచే అధికారులపై చర్యలు మొదలయ్యాయి.. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
