తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. సీఎం జగన్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి విరిగింది కాబట్టి.. జగన్ పరామర్శించారని, రేవంత్ కు తుంటి విరగలేదు కదా అని కామెంట్ చేశారు.
Read Also: Bandla Ganesh: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని.. అందులో రేవంత్ రెడ్డి సుప్రీం కాదన్నారు కొడాలి నాని. కాంగ్రెస్ సీఎం పదవి ఇచ్చిందని.. దాన్ని రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేయాలని సూచించారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలి నాని అన్నారు. మరోవైపు.. షర్మిలకు సపోర్ట్ ఎందుకని, రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఏపీకి వచ్చి పనిచేయాలని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవ్వాలని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబును గెలిపించాలంటే షర్మిలకు సపోర్ట్ ఇవ్వాల్సిందేనన్నారు.
Read Also: Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
ఇదిలా ఉంటే.. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ. 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడన్నారని కొడాలి నాని విమర్శించారు.
