NTV Telugu Site icon

Amaravati: అమరావతి అభివృద్ధికి ముందడుగు.. ఢిల్లీలో కీలక భేటీ

Amaravati

Amaravati

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మళ్లీ అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునర్‌ ప్రారంభించడమే కాకుండా.. పలు కీలక సంస్థలను అమరావతికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇక, అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..

Read Also: RukminiVasanth : రానున్నది ‘రుక్మిణి వసంత’ కాలం

ఈ రోజు సాయంత్రం వరకూ త్రైప్రాక్షిక చర్చలు కొనసాగనున్నాయి. చర్చల తరువాత ఎంవోయూపై సంతకం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు.. కాగా, అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. సమావేశంలో ఏపీ తరపున సీఆర్డీఏ కమిషనర్ కె. భాస్కర్, ఏడీసీఎల్‌సీ ఎండీ లక్ష్మీ పార్ధసారధి, ఆర్ధికశాఖ కార్యదర్శి డి. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.. మరోవైపు.. అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయం విదితమే.. ప్రపంచ బ్యాంక్‌ సహా ఇతర సంస్థల నుంచి రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పించనుంది.