ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” అభివృద్ధికి ఈ ఏడాది చివరకల్లా రూ. 15 వేల కోట్లు రుణం ఇవ్వనున్నారు.. “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” (ఏడీబీ)లు సంయుక్తంగా రూ. 15 వేల కోట్లు రుణం అందించనున్నాయి.. “అమరావతి” అభివృద్ధికి రుణ మంజూరుపై ఈ రోజు ఢిల్లీలో రెండు బ్యాంకుల ఉన్నతాధికారులతో ఏపీ ఉన్నతాధికారుల చర్చలు సుదీర్ఘంగా సాగాయి..
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..