NTV Telugu Site icon

Vamsi, Varma, Posani Cases: వంశీ, వర్మ, పోసాని కేసుల్లో కీలక పరిణామాలు..

Delhihighcourt

Delhihighcourt

Vamsi, Varma, Posani Cases: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందని చెప్పారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్‌ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేసినట్లు కోర్టుకు వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు, వంశీకి ఎలాంటి సంబంధం లేదన్నారు వంశీ లాయరర్లు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..

ఇక, దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సీఐడీ నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ… హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌పై ఆరు వారాలు స్టే విధించింది. గతంలో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో… తెలియదా అని నిలదీశారు. అనంతరం కేసు విచారణపై ఆరువారాలస్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 17కు తదుపరి విచారణ వాయిదా వేశారు.

Read Also: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

మరోవైపు మాజీ ఎంపీ గోరంగ్ల మాధవ్‌.. విజయవాడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా అత్యాచార బాధితుల వివరాలు వెల్లడించారంటూ గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గోరంట్ల మాధవ్‌ను…బెజవాడ పోలీసులు విచారించారు. అటు కర్నూలు జిల్లాలో పోసాని కృష్ణ బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. పోసానిని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో…పోసాని లాయర్లు వ్యతిరేకించారు. కస్టడీకి ఇచ్చినా…ఉన్నతాధికారుల సమక్షంలోనే విచారించాలని కోరారు.