Jana Sena Party: జనసేన ఆవిర్భావ దినోత్సవం రద్దు.. కారణం ఏంటంటే..?

  • 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రద్దు..
  • సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీరియస్ ఫోకస్ పెట్టిన అధిష్టానం..
  • రేపటితో ముగియనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు..
  • సభ్యత్వ నమోదు గడువు పెంచే ఆలోచనలో పార్టీ నాయకత్వం
Pawan Kalyan

Pawan Kalyan

Jana Sena Party: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. మార్చి 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం.. అదే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. రేపటితో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. గడువును మరికొంత కాలం పొడిగించే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 8 లక్షల 70 వేల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా భావించిన జనసేన.. అందుకే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసి సభ్యత్వాల పెంపుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించింది.

Read Also: Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక

మొత్తంగా ఈ నెల 14న నిర్వహించాల్సిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం కీలక దశలో ఉండటంతో, అదే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జనసేన నాయకత్వం నిర్ణయించింది. సభ్యత్వ నమోదు గడువు రేపటితో ముగియనుండగా, గడువును మరికొంత కాలం పొడిగించే అంశంపై కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది జనసేన అధిష్టానం.. .