Site icon NTV Telugu

AP Mega DSC: మెగా డీఎస్సీకి లైన్‌ క్లియర్‌

High Court

High Court

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు.. అయితే, హాల్‌ టికెట్లు జారీచేశారు.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారని వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాది.. దీంతో, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.. కానీ, ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలుపుదల(స్టే) చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

Read Also: Meghalaya: హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్! అధికారులు ఏం తేల్చారంటే..!

పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరపిని ఏపీ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిలుపుదలకు నో చెప్పింది.. కాగా, ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు గతంలో సుప్రీంకోర్టు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ, టెట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కొంతమంది అభ్యర్థులు డీఎస్సీ షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించగా.. ఇప్పుడు హైకోర్టు కూడా స్టే ఇవ్వడానికి నో చెబుతూ.. ఆ అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది..

Exit mobile version