Site icon NTV Telugu

Amaravati Land Pooling: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు బ్రేక్..!

Amaravati Land Pooling

Amaravati Land Pooling

Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి…భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో…రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది. దీనిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితి చక్కబడిన తర్వాత రెండో విడత భూసమీకరణపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్.

Read Also: Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..

కరేడులో ఇండోసోల్ కంపెనీకి సంబంధించిన భూములు కేటాయింపు అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ…రైతులు ఆందోళన చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని…కానీ సారవంతమైన భూములు రైతులకే చెందాలని ఆందోళన జరుగుతోంది. రెండు పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేవూరు ప్రాంతంలో ఇండోసోల్‌కు భూ కేటాయింపులు జరిగాయి. పరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో కాకుండా మరో చోట భూమి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను…బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి సెంట్ భూమి ఇచ్చే ప్రసక్తి లేదంటున్నారు అన్నదాతలు.

Read Also: Kingdom: అమెరికాలో సత్తా చాటుతున్న విజయ్.. “కింగ్డమ్” కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్..!

కుప్పం, దగదర్తి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుకు…ప్రభుత్వం భూ సమీకరణకు రెడీ అవుతోంది. ఈ ప్రాంతాల్లో కూడా వ్యతిరేక వస్తోంది. ఎయిర్‌పోర్టులకైనా…వేల ఎకరాల్లో భూములు కావాల్సి ఉంటుంది. దీంతో రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతపై ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ఇక ఉత్తరాంధ్ర కొత్తవలస ప్రాంతంలో జిందాల్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన సదుపాయాలు రాలేదంటున్నారు. ఇంటికో ఉద్యోగం, ఆర్ధిక సహాయం ఇవి సక్రమంగా అమలు కాలేదని అంటున్నారు. అయితే పారిశ్రామిక అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం భూములు అవసరమే…కానీ రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version