NTV Telugu Site icon

AP Liquor Shops: నేటితో మూతపడనున్న ప్రభుత్వ వైన్‌షాపులు..

Liquor Shops Closed

Liquor Shops Closed

AP Liquor Shops: ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా లక్ష దరఖాస్తులు వస్తాయని భావించిన అధికారులు.. సుమారు 90వేల దరఖాస్తులతో టెండర్లను ముగించారు దాదాపుగా 1800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.ఎంఆర్పి ప్రకారం మాత్రమే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Read Also: Pushpa 2 : పుష్ప 2 చూశా…అబ్బా ఏం యాక్షన్.. అవార్డులన్నీ అల్లు అర్జున్ కే : నిర్మాత ఎస్ కేఎన్

వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసిన వారందరికీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు లాటరీ విధానం ద్వారా షాపులను కేటాయించారు. ఢిల్లీ తెలంగాణ మహారాష్ట్ర యుపి ప్రాంతాల నుంచి కూడా లిక్కర్ వ్యాపారులు ఆన్లైన్ ద్వారా టెండర్స్ వేసి షాపులను పొందారు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు 5,825 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 40 షాపులకు 1205 దరఖాస్తులు వచ్చాయి తిరుపతి జిల్లాలో అత్యధికంగా 227 షాపులు ఉన్నాయి. వీటికి 3920 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలను కైవసం చేసుకోవడం కోసం లిక్కర్ సిండికేట్ లో 50 నుంచి 100 టెండర్లు దాఖలు చేశారు తద్వారా ఐదు నుంచి పది షాపులు పొందారు పది నుంచి 30 టెండర్లు వేసిన కొందరు సిండికేట్లకు ఒక్క షాప్ కూడా రాకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.

Read Also: Jr.NTR: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

ఈసారి మద్యం దుకాణాలను మహిళలు కూడా చేజిక్కించుకున్నారు. విజయవాడ ,విశాఖ, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో మహిళలకు మద్యం దుకాణాలు లాటరీ విధానంలో దక్కాయి ఎన్టీఆర్ జిల్లాల్లో 16 కృష్ణా జిల్లాలో 7 విశాఖ జిల్లాలో 11 షాపులు మహిళలకు వచ్చాయి.. గతంలో ఏపీలో లేని MC విస్కీ, రాయల్ చాలెంజ్, KF స్ట్రాంగ్, షీవజ్ రీగల్ లాంటి చాలా బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్ మద్యాన్ని…త్వరలోనే అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు నడవనున్నాయి .లాటరీ విధానంలో షాపులు పొందిన దరఖాస్తుదారులు డబ్బు చెల్లించి ప్రొవిజినల్ లైసెన్స్ తీసుకున్నారు.అయితే షాపులు దక్కించుకున్నవారిలో కొందరికి … లైసెన్సులు వదులుకోవాలని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు.. లిక్కర్ సిండికేట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Show comments