Site icon NTV Telugu

Annadata Sukhibhava: గుడ్‌న్యూస్‌.. ఇవాళే వారి ఖాతాల్లో సొమ్ము జమ..

Annadata Sukhibhava

Annadata Sukhibhava

Annadata Sukhibhava: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సూపర్‌-6 హామీల అమలులో భాగంగా – అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది.. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది రైతులు ఈ స్కీమ్​ ద్వారా లబ్ధిపొందనున్నారు.. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం 2,342.92 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద మొదటి విడతగా రూ.2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలను రైతులకు సాయం అందించనుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.7,000 జమ కానున్నాయి.. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందించనున్నట్టు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఆ హామీ అమలుకు సిద్ధమైంది..

Read Also: Congress Legal Summit: నేడు ఢిల్లీలో ఏఐసీసీ న్యాయ సదస్సు.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏడాదికి 20వేల చొప్పున మూడు దపాలుగా ఆర్థిక సహాయం అందజేయనుంది ప్రభుత్వం.. తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల నగదును జమ చేయనున్నారు.. ఈ మొత్తంలో 5,000 రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 2,000 కేంద్ర పీఎం కిసాన్ నిధులు ఉంటాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,342 కోట్ల రూపాయల నిధులు జమ చేయనున్నారు.. అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా పంట పొలాల మధ్య ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం..

Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..

చంద్రబాబు పర్యటన షెడ్యూల్..
* ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు..
* 10.50 దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలోని అన్నదాత సుఖీభవ వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం
* 11 గంటల నుంచి 1.15 గంటల వరకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న చంద్రబాబు..
* మధ్యాహ్నం 1.50 నుంచి 2.50 వరకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం
* తిరిగి 3 గంటలకు బయలుదేరి 3.40 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

Exit mobile version