Site icon NTV Telugu

Godrej: ఏపీలో గోద్రెజ్‌ భారీ పెట్టుబడి..! సీఎంతో ఆ సంస్థ చైర్మన్ కీలక చర్చలు..

Godrej

Godrej

Godrej: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తున్నాయి.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.. విశాఖపట్నం, అమరావతిలో పెట్టుబడులకు అవకాశాలపై గోద్రెజ్ బృందం ఆరా తీసింది.. అగ్రీ, అక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్నాయనే కోణంలో గోద్రెజ్ ప్రతినిధులతో సీఎం మంతనాలు జరిపారు.. వంట నూనెలు, పామాయిల్ ఉత్పత్తి పెంచే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది.. వంటనూనెలు, పామాయిల్ ఉత్పత్తి పెంచేలా కేంద్రం చేపట్టిన జాతీయ మిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చించింది దోద్రెజ్‌ బృందం.. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.. వివిధ సంస్థలతో.. గతంలో వెనక్కి వెళ్లిన కంపెనీలతో.. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న సంస్థలతోనూ కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుతోన్న విషయం విదితమే.

Read Also: Health Tips: రన్నింగ్ పూర్తి చేసిన వెంటనే చేయకూడని పనులు

Exit mobile version