NTV Telugu Site icon

AP News: ఏపీలో చెత్త పన్ను రద్దు.. గెజిట్ జారీ

Ap

Ap

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక… చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ అయింది. ఇక నుంచి ఏపీలో చెత్తపై పన్ను ఉండదు.

ఇది కూడా చదవండి: Vizag: భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య

గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేశారు. దీనిపై కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే.. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెత్త పన్ను రద్దు చేశారు.

ఇది కూడా చదవండి: Kash Patel: FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం.. ట్రంప్ ప్రశంసలు