Site icon NTV Telugu

Gadikota Srikanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బహిర్గతమైంది..!

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదంపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. గత ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతుండగా వైసీపీ సీనియర్‌ నేత ఈ వ్యవహారంపై హాట్‌ కామెంట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచేసిన మోసం బహిర్గతం అయ్యిందని దుయ్యబట్టారు వైఎస్పీసీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. సమాజంలో గత రెండు రోజులుగా ఈ విషయంపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండటం గమనార్హమన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనను అసెంబ్లీ లో అమలు చేయడంలో మంత్రి రామానాయుడు ఆమోదముద్ర వేసినందుకు ప్రజల్లో కోపం ఉన్నదని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుపై ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పనిచేసే కార్యక్రమాల్ని ఆపించించానని తెలిపారు అన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.. గతంలో చంద్రబాబు ఎన్నోసారి విభిన్న కారణాలతో పనులను నిలిపివేశారని ఒకసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో ఆపామని, మరలా ఇతర కారణాలు చెప్పారని విమర్శించారు.

Read Also: Jana Nayagan: దళపతి ఆఖరి పోరాటం.. ఇంకా రాని సెన్సార్ సర్టిఫికేట్!

అలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును కూడా తిరస్కరించడం గురించి, అలాగే ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం స్టోరేజ్ స్థాయిని రెండింతలు పెంచుతున్న విషయం పై ఏపీ ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా లేకపోవడం పై కూడా ప్రశ్నించారు శ్రీకాంత్‌ రెడ్డి. గత 20 సంవత్సరాల్లో కేవలం నాలుగు సంవత్సరాలకే మాత్రమే నీటి విడుదలను ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. అనేక సంవత్సరాలుగా నీటి సమస్యతో కష్టపడుతున్న రాయలసీమ ప్రజలకు నీటి ఇబ్బంది ఇంకా కొనసాగుతోందని అతడు అభిప్రాయపడ్డారు. అయితే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు వల్ల అనేక ప్రాజెక్టులకు నీళ్లు రావడంలో మార్పులు చూపితే కూడా నిజానికి నీటి విడుదల విషయంలో సరైన సమాధానాలు లేవని వ్యాఖ్యానించారు.

ఇక, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి 881 అడుగులు కావాలన్నారు.. కానీ, ఆ స్థాయికి నీటిని నిలుపకపోవడం వల్ల ఇబ్బందులు కొనసాగుతుండటాన్ని శ్రీకాంత్ ప్రశ్నించారు. అంతేకాదు, నారాయణపూర్, జూరాల నిండిన తర్వాతే శ్రీశైలం నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదన్న అనుమానం వ్యక్తం చేశారు. నీటి హక్కులు, ప్రాజెక్టులను అమలు చేసే విధానంలో సమ సమానత్వం లేదు అని, దిగువ రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు ఉన్నట్టు భావిస్తున్నామని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్, జగన్ ప్రభుత్వం తొలగించిన ప్రాజెక్టులు, నీటి పంపిణీ సముచితంగా జరగడం లేదని విమర్శించారు. మీరు వాదించే అంశాలను బట్టి మీరు చెబుతున్నది సరైనదేనా? అన్న ప్రశ్నను నేరుగా చంద్రబాబుకే వేశారు.. అయితే, ఎగువ ప్రాజెక్టులపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గడికోట శ్రీకాంత్‌ రెడ్డి..

Exit mobile version