Site icon NTV Telugu

Perni Nani: ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!

Perni Nani

Perni Nani

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వ హననం చేయని రోజూ చంద్రబాబు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. పనామా లీక్స్, పారడైస్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. జగన్‌ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. జగన్‌కు 40 శాతం ఓటింగ్ రావటంతో దాన్ని ఎలాగైనా చంపాలని చంద్రబాబు అండ్ బ్యాచ్ రాక్షసులు విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.

Read Also: AP Assembly: పీఏసీ కొత్త చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?

చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతి చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. సింగపూర్ హోటల్స్ వ్యవహారం గుర్తు తెలియదా..? సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టు కూడా అయ్యారని గుర్తు లేదా అని అన్నారు. అదానీ.. జగన్ సమయంలో పెట్టుబడి పెడితే విష ప్రచారం, చంద్రబాబు సమయంలో అదానీ పెట్టుబడి పెడితే మాత్రం మంచిది అన్నట్టు ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ప్రభుత్వం అంగీకరిస్తే కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అని ఓట్లు అడిగి 17 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు.

Read Also: TPCC Mahesh Goud : మోడీ వల్లే అదానీ దురాగతాలు పెరిగిపోతున్నాయి

నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అప్పులు మిగిలాయని పేర్ని నాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో SEKI తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అదానీతో తాము ఒప్పందాలు చేసుకోలేదని విమర్శించారు. అమెరికా పోలీసులు అరెస్టు చేస్తే కేంద్రంలో అప్పట్లో ఉన్న మంత్రిని, సెకి చైర్మన్‌ను తీసుకు వెళ్తారు తప్ప జగన్‌కు ఏం సంబంధం..? అని పేర్ని నాని ప్రశ్నించారు.

Exit mobile version