NTV Telugu Site icon

Heavy Rains in AP: ఏజెన్సీలో ఉప్పొంగిన వాగలు, వంకలు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్..

Heavy Rains

Heavy Rains

Heavy Rains in AP: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడు తున్నారు. ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కోడా పుట్టు, ఉబ్బింగుల, దొరగుడ గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఉబ్బింగుల గ్రామం నుంచి లక్ష్మీపురం వచ్చే మార్గంలో ఉన్న గెడ్డ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. గెడ్డకు అవతల వైపు ఉన్న ఉబ్బెంగుల, దొరగుడ గిరిజనులు ఆ ప్రవాహంలో దిగి ప్రయాణిస్తేనే కనీసం పంచాయతీ కేంద్రానికి చేరగలరు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని, రెండు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిం చాలని అనేకమార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదంటున్నారు. కోడాపుట్టు సమీపంలో గెడ్డ ప్రవాహం పెర గడంతో గ్రామస్తులంతా గ్రామాల్లో మగ్గిపోయారు. బిరిగుడ గెడ్డపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగు తాయని, పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!

ఇక, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏజెన్సీలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారి గూడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది జలాశయం పూర్తి నీటిమట్టం 83.50మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 82.90 కి చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 20000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కాగా అధికారులు నాలుగు గేటు ఎత్తి 17000 క్యూసెక్కుల నీటిని దిగివకు విడుదల చేశారు. ఎర్ర కాలువ జలాశయం దిగువ మండలాలు ప్రజల నిడదవోలు తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించిన రైతులు ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.. మరోవైపు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో డైవర్షన్ రహదారిపై జల్లేరువాగు ప్రవహిస్తుండగా 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సదుపాయం లేకుండా పోయింది. ఇప్పలపాడు, రెడ్డి గణపవరం, కన్నాపురం, వద్ద వాగులు రహదారులపై ప్రవహించడంతో దీంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగులు దాటువద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read Also: Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఎర్ర కాలువ ఆనుకొని ఉన్న అధికారులు డేంజరస్ ప్రాంతం గా గుర్తుంచారు… కరటం కృష్ణమూర్తి జలాశయం నుంచి భారీగా వరద నీరు దిగువకు వదలడంతో అనంతపల్లి, గుండెపల్లి, తాడేపల్లిగూడెం, మండలం, వీరంపాలెం, మాధవరం ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి … ఉగ్రరూపంతో ఎర్రకాలువ వరద ప్రవాహం కొనసాగుతుంది .. అనంతపల్లి గ్రామంలో ఎర్రకాలువను అనుకొని ఉన్న 200 ఇల్లులను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు.. అర్ధరాత్రి ఎర్ర కాలువ నీటిమట్టం పెరగడంతో పరివాహక ప్రాంత రైతులు తమ పశువులను ఎర్ర కాలువ నుంచి తీసుకొచ్చి భద్రపరచుకోవడం జరిగింది …

Read Also: Air India: ఢిల్లీ నుంచి యూఎస్ వెళ్తున్న విమానం రష్యాలో ల్యాండ్.. కారణం చెప్పిన ఎయిర్ ఇండియా..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటిపేదపూడిలో నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు.. ఎలాంటి భద్రత చేపట్టకుండానే గోదావరి ఉధృతిలో పడవ ప్రయాణం సాగించాల్సి వస్తుంది.. కనీసం లైఫ్ జాకెట్స్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శిస్తున్నారు.. వరద ప్రవాహంలో లైఫ్డ్ జాకెట్స్ లేకుండా స్కూల్ పిల్లలను పడవ దాటిస్తున్నారు.. భద్రత ఏర్పాట్లు చేయకపోవడం పై మండిపడుతున్నారు లంక గ్రామాల ప్రజలు.. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం ,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్ వేల పైకి వరద నీరు చేరనుంది.