Site icon NTV Telugu

CM Chandrababu: బాలయ్య రచ్చకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారా..?

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు… మెగాస్టార్‌ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు కలిగిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వం లో జరిగిన సినిమా మీటింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్.. సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి చర్చించారు. చిరంజీవి లీడ్ తీసుకోవడం.. గట్టిగా మాట్లాడడం వల్లనే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు.. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ మండి పడ్డారు.. ఎవడూ… గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు బాలకృష్ణ.. అయితే, బాలకృష్ణ వ్యాఖ్యల పై పవన్ కల్యాణ్‌, నాగబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు.. కానీ, చిరంజీవి ఫాన్స్ రగిలిపోయారు.. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిరసనలు తప్పవన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.. ఈ దెబ్బకి కామినేని తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అన్నారు.. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడే చంద్రబాబు అలర్ట్ అయ్యారు.

Read Also: Karur Stampede: పథకం ప్రకారం జరిగిన కుట్ర.. నేడు హైకోర్టులో టీవీకే పిటిషన్‌పై విచారణ!

హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు… పవన్ వైరల్ ఫీవర్‌తో ఉన్నందున పరామర్శించారు… పేరుకు పరామర్శ.. కానీ, చిరంజీవి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.. ఇప్పుడు కనక. ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు చంద్రబాబు గుర్తించారు. చిరంజీవి విషయంలో సరిగ్గా స్పందించక పోతే ప్రధాన సామాజిక వర్గం నుంచి కుడి ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. దీంతో పాటు కూటమి లో ప్రధానంగా పవన్ ఉన్నారు. దీంతో సామాజిక వర్గంలో కనక… ఆందోళనలు మొదలైతే. అవి ఏ స్థాయికి వెళ్తాయో చంద్రబాబుకు బాగా తెలుసు.. అందులోనూ మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రధాన మద్దతు ఇచ్చిన సామాజిక వర్గం కావడంతో బాబు మరింత సీరియస్ గా తీసుకున్నారు.

అందులోనూ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కావడంతో మరింత హాట్ టాపిక్ అయ్యాయి.. పవన్ కల్యాణ్‌ ఈ విషయంలో స్పందించక పోవడం కూడా ఇబ్బందులు తప్పవని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే వెళ్లి పవన్ ను కలిసారు.. చిరంజీవి అంశం చాలా.. సున్నితమైన అంశం కావడంతో చంద్రబాబు ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో నే ఈ అంశానికి పవన్ ను కల్వడంతో క్లోజ్ చేశారు. గతంలో కూడా. 2014లో మొదటి సారి పవన్ కల్యాణ్‌ అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లారు చంద్రబాబు.. ఇప్పుడు కూడా ఇబ్బంది వచ్చిందని పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్లారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. మొత్తానికి తన రాజకీయ అనుభవం ప్రస్తుతం చంద్రబాబు ఉపయోగించి.. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.

Exit mobile version