Deputy CM Pawan Kalyan: విశాఖలో అక్రమంగా గోమాంసం నిల్వ.. పవన్ కల్యాణ్ సీరియస్..
- విశాఖలో అక్రమంగా గో మాంసం నిల్వ ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్..
- గోమాంసం పట్టుబడిన కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఆరా తీసిన పవన్..
- గోమాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలకూడదని దిశానిర్దేశం..
- గోమాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించండి అని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: విశాఖలో అక్రమంగా గో మాంసం నిల్వ ఘటనపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గో మాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపడాలంటూ.. విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా.. ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే.. పవన్ కల్యాణ్ స్వయంగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారో? ఎక్కడి నుంచి తెచ్చారో? ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారో? వీటి అన్నిటి పై ఆయన వివరంగా ఆరా తీశారు.
Read Also: Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
Also Read
- Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
DRI అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో.. 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు.. ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు. దాడుల సమయంలో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోందని కూడా తెలిపారు. ఈ గోమాంసం ఎక్కడి నుంచి తెచ్చారు? అక్రమ రవాణా నెట్వర్క్ ఎంత పెద్దది? అవసరమైన అనుమతుల విషయంలో ఏయే ఉల్లంఘనలు జరిగాయి? ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కూడా హామీ ఇచ్చారు. NDA ప్రభుత్వం గోమాంసం నిషేధంపై ఎంత దృఢంగా పనిచేస్తుందో.. ఈ కేసు మరోసారి నిరూపించిందని అన్నారు పవన్ కల్యాణ్. అక్రమ గోవధ, గోమాంస విక్రయం, లేదా ఎగుమతి.. ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గతంలో పిఠాపురం జంతు వధశాల ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే.. దానిపై చర్యలు తీసుకొని వధశాలను మూసివేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!