NTV Telugu Site icon

CPM Raghavulu: డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం

Cpmraghavulu

Cpmraghavulu

డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు. పార్లమెంటు సీట్లు పెంచాలంటే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డీలిమిటేషన్ మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అమిత్ షాకి వంతపాడతారా..? ఎదురుతిరుగుతారో చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు.

కోతల బడ్జెట్..
ఏపీ బడ్జెట్ కోతల బడ్జెట్ తప్ప నిజాయితీ కలిగిన బడ్జెట్ కాదు అని రాఘవులు ధ్వజమెత్తారు. ‘‘బడ్జెట్‌లో చూపిస్తున్న అంకెలు సంవత్సరంలో కోతబడతాయి. పన్నేతర ఆదాయం రూ. 12 వేలు పెరుగుతుందని.. అది ఎలా తెస్తారో చెప్పలేదన్నారు. మభ్యపెట్టడానికి చేసినదే ఏపీ బడ్జెట్. బడ్జెట్ ప్రారంభంలోనే మూడు సిక్స్‌లు లేకుండా పోయాయి. మిగిలిన మూడు సిక్స్‌ల్లో లబ్ధిదారుల కోత పెడతారని అర్థమవుతుంది. ప్రకటించిన డీఎస్సీని వర్గీకరణ అనంతరమే ప్రకటిస్తాంమంటూ వాయిదా వేసే పరిస్ధితి కనిపిస్తోంది. బడ్జెట్ చూస్తే సంవత్సరం పాటు ఆకలి లేకుండా పోయేలా ఉంది. వెలిగొండ తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది చేయడం లేదు. సంతృప్తి పరచడానికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు.’’ ఉన్నాయని రఘవులు ఆరోపించారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​చేస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్‌‌‌‌సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఉండగా 28కి పెరుగుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బిహార్‌లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌‌‌‌సభ స్థానాలు ఉండగా.. 128కి పెరిగే అవకాశం. బీహార్‌‌‌‌‌‌‌‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌‌‌‌లో 25 నుంచి 44కి లోక్‌‌‌‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో 28 స్థానాలుండగా.. 36కి పెరుగుతాయి.