AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టినా.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అవి ముందుకు సాగలేదు.. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది.. ఆ పనులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు.. ఏపీ సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అయితే, 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ.. కానీ, ఆ తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి.. ఇక, ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు.. పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు..
Read Also: Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు.. అప్పటికే పూర్తి అయిన భవనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించిన విషయం విదితమే.. ఇక, ఆ నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా? లేక దెబ్బతిన్నాయా? అనే అంశంపై కూడా అధ్యయనం చేయించి.. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.