NTV Telugu Site icon

CM Chandrababu: భారీ వర్షాలు.. 9వ రోజు సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌..

Chandrababu

Chandrababu

CM Chandrababu: వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయట పడతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు..

Read Also: Bandi Sanjay: నేను హైడ్రాకి సపోర్ట్ చేశా.. ఇప్పుడు విశ్వాసం పోతుంది..

వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ ను ఉపయోగించండి.. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయండి అని సూచించారు సీఎం చంద్రబాబు.. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్దరణ పూర్తి అయ్యిందని తెలిపిన అధికారులు.. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.. మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సూచించారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.. ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు..

Read Also: Heavy Rains: భారీ వర్షాలు.. విలీన మండలాలు అతలాకుతలం..

ఇక, ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ఫ్లో… అవుట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు అన్నారు. ఏలేరు రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో గండ్లు పడే అవకాశం ఉన్న 3 ప్రదేశాలను గుర్తించామని సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్.. తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ధవళేశ్వరం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, నీటి ప్రవాహం తగ్గడంతో అది ఉపసంహరించామని సీఎంకు తెలిపారు తూర్పుగోదావరి కలెక్టర్… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించిన జిల్లా కలెక్టర్లు..

Show comments