CM Chandrababu Serious Warning: ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తరువాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన శ్రీకాంత్ పెరోల్ అంశం తో పాటు. శ్రీశైలం ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డి అంశం పై చర్చ జరిగింది.. ఎమ్మెల్యే లు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు… సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు… ఎమ్మెల్యేలు అత్యుత్సాహం తగ్గించు కోవాలన్నారు.. అవసరం అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా చర్యలకు వెనకాడే పరిస్థితి లేదన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Regina Cassandra: సినీ పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెజీనా కసాండ్రా
మంత్రులు, ఎమ్మెల్యేలకూ చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు.. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు చంద్రబాబు.. జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రధానంగా సీఎం వివరించారు.. ఎమ్మెల్యేలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే అనవసర ఇబ్బందులు తప్పవన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Vishwambhara Glimpse: బాసూ అదిరింది నీ గ్రేసు.. గూస్‌బంప్స్ అంతే
ఇక, ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి కూడా మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. కొంతమంది మంత్రులు. అధికారులు ఫైల్స్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు అన్నారు సీఎం చంద్రబాబు.. మంత్రుల పెర్ఫామెన్స్ పై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తాం అన్నారు… మంత్రులు కూడా కొన్ని అంశాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని జరుగుతున్న పరిణామాలను వివరించారు.. ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకు వెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.. కొంతమంది మంత్రులు శాఖలపై దృష్టి పెట్టి తమ పనితీరు మార్చు కోవాలని సీఎం చంద్రబాబు సూచించారు…
