Site icon NTV Telugu

CM Chandrababu: ప్రధాని మోడీ పర్యటనపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌.. మరోసారి సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చేనెల 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు… ప్రధాని రాక కోసం పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం .. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెనుక స్ధలంలో అతిపెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు‌.. ఆ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ప్రధాని మోడీ రాకకు చేస్తున్న ఏర్పాట్లు పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. సమీక్షలో మంత్రివర్గ ఉపసఘంతో పాటుగా అధికారులు హాజరయ్యారు.. ప్రధాని మోడీ రాకకు జనసమీకరణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసారు‌.. ప్రజలు, రైతులు అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి రావడానికి వీలుగా 8 దారులను సిద్ధం చేశారు.. 3 అదనపు దారులను సైతం ఏర్పాటు చేశారు.

Read Also: KCR: కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా.. ఇది సాధ్యమా..?

అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోడీని సీఎం స్వయంగా ఆహ్వానించారు.. సభకు ప్రధాని మోడీ, మధ్యాహ్నం 3:25కి వస్తారు.. 3:32కి వేదిక మీదకు వస్తారు.. 3:50కి 11 నిముషాల అమరావతి పనుల వీడియో ప్లే అవుతుంది.. 4:05 నుంచి 40 నిముషాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు.. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ బయల్దేరి వెళ్తారు… అయితే… మోడీ రాక సమయంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి.. అలాగే రైతులు చేరుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సీఎం ఆదేశించారు. ఇకపై ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు ప్రతీరోజూ సీఎం సమీక్షలు నిర్వహించనున్నారు..

Exit mobile version