Site icon NTV Telugu

CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అదే జరిగింది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Babu

Babu

CM Chandrababu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అందుకుంది.. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జోరుగా సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీ ఘన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ విజయం చారిత్రాత్మకం.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత దేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అన్నారు.. ఢిల్లీలో వాయు కాలుష్యం.. రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉంది.. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుంది.. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ అన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందన్నారు.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని పేర్కొనర్నారు..

Read Also: Robert Vadra: ఢిల్లీ ఫలితాలపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

ప్రజల ఆదాయం ఎప్పటికప్పుడు పెరగాలి. ప్రజల ఆదాయం పెంచడం సమర్ధవంతంగా చేస్తే గుడ్ గవర్నెన్స్ అన్నారు చంద్రబాబు.. భారత్ లో ఆర్ధిక సంస్కరణలు వచ్చి 34 ఏళ్లు అయ్యింది.. 1991 ఆర్ధిక సంస్కరణలను ముందు.. తర్వాత.. రెండు విధాలుగా చూడాలి. పీవీ నరసింహారావు వల్ల ఆర్ధిక సంస్కరణలు జరిగాయి.. మహారాష్ట్రలో 1995 నుంచి ఇప్పటి వరకు గ్రోత్ రేట్ బాగా పెరిగింది.. అలాగే గుజరాత్‌లో కూడా గ్రోత్ రేట్ బాగా పెరిగిందని తెలిపారు.. లీడర్ కరెక్ట్‌గా ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.. ప్రధాని మోడీ గొప్ప నాయకుడు.. రైట్ టైంలో రైట్ లీడర్‌షిప్ దేశానికి దొరికిందన్నారు.. అయితే, సంక్షేమం ఇస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారు.. బటన్ నొక్కుతున్నామని అవినీతి చేస్తున్నారని ఆరోపించారు..

Read Also: Delhi Election Results: ఆప్‌లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?

ఇక, ఏపీకి.. ఢిల్లీకి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు.. ఢిల్లీలో ఎక్కడ పోయినా చెత్త ఉంటుంది.. మెయిన్ రోడ్ లో కూడా చెత్త ఉంటుందని.. ఢిల్లీలో హై పొల్యూషన్.. ఢిల్లీ టోటల్ ఫెయిల్యూర్ మోడల్‌ అని పేర్కొన్నారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని విమర్శించారు.. ఋషికొండలో కూడా ఇదే పరిస్థితి.. ఎమ్మార్వో కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.. బటన్ నొక్కే కార్యక్రమం ఢిల్లీలో సక్సెస్ కాలేదు.. ఏపీలో కూడా ఇలాగే ఉంటుందన్నారు.. మోడీ వికసిత్ భారత్ 2047 తీసుకున్నారు.. మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం.. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో నిరసన వ్యక్తం అయ్యింది.. తెలంగాణలో నా అరెస్ట్ నిరసనలు అణచివేయాలని చూసి ఫలితం అనుభవించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version