Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Naidus Key Instructions To Ministers And In Charge Ministers On Mlc Elections 2025

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలు.. మంత్రులకు టార్గెట్‌ పెట్టిన సీఎం..

Published Date :February 5, 2025 , 7:44 pm
By Sudhakar Ravula
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
  • మంత్రులకు టార్గెట్ పెట్టిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలు.. మంత్రులకు టార్గెట్‌ పెట్టిన సీఎం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్‌ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు పర్యటనలో ఉన్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయ్యింది.. దీంతో, కూటమి నేతలు, మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు..

Read Also: AP Cabinet Meeting: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలు..!

తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు.. ప్రధానంగా చదువుకున్న వారికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేస్తున్నది అనేది నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు.. సీఎం చంద్రబాబు కూడా గ్రేడ్యుయేట్‌లను ఆకర్షించే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.. ఉభయగోదావరిలో సీపీఎం పోటీలో ఉంది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.. ఇక, కృష్ణ – గుంటూరు గ్రేడ్యూయెట్ లకు సంబంధించి ఆలపాటి రాజా పోటీలో ఉన్నారు.. ఇక్కడ కూడా కృష్ణ – గుంటూరు మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ, పీడీఎఫ్‌ నుంచి పోటీ ఉంది.. దీంతో, మంత్రులు ప్రచారం ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగానే మంత్రులు, నేతలు.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ గా రఘువర్మ పోటీ చేస్తున్నారు. టీచర్ ఫెడరేషన్ నుంచి గాదె శ్రీనివాసులు పోటీలో ఉన్నారు.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో విజయం సాధించాలని టీడీపీ దృష్టి పెట్టింది.. మంత్రులు కూడా ఈ మూడు వారాలు సీరియస్‌గా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని.. విజయం సాధించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Ministers
  • cm chandrababu
  • In-charge Ministers
  • MLC ELECTIONS

తాజావార్తలు

  • Donald Trump: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన మిత్రదేశం.. హోర్ముజ్ దిగ్బంధనంపై బ్రిటన్ సంచలన నిర్ణయం!

  • Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Virat Kohli Angry: కోహ్లీ రౌద్రరూపం.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్, గ్లౌజులు విసిరేసిన కింగ్.. వాంఖడేలో ఏం జరిగింది?

  • Astrology: ఏప్రిల్‌ 13, సోమవారం దినఫలాలు.. ఏ రాశివారికి శుభవార్త అంటే..?

  • Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions