CM Chandrababu: పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు – అధికారులు మధ్య గాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇంచార్జి మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి. అర్జీలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇంచార్జిలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జిలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.. పార్టీకి ప్రాధాన్యత.. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు…..
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి… ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు.., ఇంచార్జి మంత్రులు సరిగ్గా ఎమ్మెల్యేలకి చెప్పలేకపోవడం.. ఇలా ఇవన్ని కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.. దీంతో ముందు మంత్రులు – ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. ఇందుకోసమే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని చెబుతున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..