Site icon NTV Telugu

CM Chandrababu: వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. సీఎం సీరియస్‌ వార్నింగ్

Cbn

Cbn

CM Chandrababu: ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు చంద్రబాబు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..

Read Also: Secunderabad Railway Station: హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు

ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.. ఇక, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే సమాచారం నా దగ్గర ఉంది.. ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని అలర్ట్ చేశారు.. ఇక, ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. సరైన పనివిధానాన్ని చూపించలేకపోతే.. మళ్లీ సీటు ఇవ్వడం కుదరదు అనే సంకేతాలను ఇచ్చారు.. మరోవైపు, 2024 జూన్ కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌ లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం.. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version