Site icon NTV Telugu

CM Chandrababu: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్‌.. వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..

Babu Nadda

Babu Nadda

CM Chandrababu: కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్‌ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారుల‌ను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు..

Read Also: SS Rajamouli : వెబ్ సిరీస్ లో నటించిన రాజమౌళి.. ఎలా చేశాడో చూశారా..

ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రి అచ్చెన్నాయుడికి తెలిపారు అధికారులు.. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు.. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడ‌టం వ‌ల‌నే రాష్ట్రానికి యూరియా కేటాయింపు జరిగిందన్నారు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.. మరోవైపు, ర‌బీ సీజ‌న్ కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఎరువుల‌ను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.

Exit mobile version