Chandrababu and Lokesh Delhi Tour: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. ఉపరాష్ట్రపతి నామినేషన్.. అంతకు ముందు ఎన్డీయే పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు.. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మరోవైపు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా హస్తినకు వెళ్తున్నారు.
Read Also: Delhi: ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
ఎల్లుండి జరిగే ఎన్డీయేపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు. 21న ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలోగా రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చించిన లోకేష్.. మరోసారి వాటి ప్రస్తావన తేనున్నారు రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు మంత్రి అశ్వనీ వైష్టవ్‌ని కలిసి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు. అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలుస్తారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ను, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ని కలుస్తారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తోనూ మంత్రి లోకేష్ సమావేశమవుతారు. వాళ్లందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున పలురకాల ప్రతిపాదనలు, విజ్ఞప్తులు అందజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్.. రాష్ట్రప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు ఇవ్వనున్న మంత్రి లోకేష్
