Site icon NTV Telugu

Vizag MLC Elections: చంద్రబాబుతో ముగిసిన విశాఖ నేతల భేటీ.. ఇంకా తేలని ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ..!

Cbn

Cbn

Vizag MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాలు ఫోకస్‌ పెట్టాయి.. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తెలరలేపగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.. ఇవాళ రాత్రి లేదా రేపటికి అభ్యర్థి ఎన్నిక.. ఎన్నికల్లో పోటీపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది అంటున్నారు.. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారట చంద్రబాబు. అర్బన్‌లో ఎన్ని ఓట్లు.. రూరల్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు..

Read Also: YVS Chowdary: ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు.. వైవీఎస్ చౌదరి షాకింగ్ ఆన్సర్

మరోవైపు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారట పార్టీ నేతలు.. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలా బలాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు. అయితే, విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు.. విశాఖ నేతలను ఆదేశించారట.. కాగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల బలం.. తమకు ఎక్కువగా ఉన్నందున.. గెలుపు మాదేననే ధీమాలో వైసీపీ ఉంది.. మరి.. కూటమి నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి ప్లాన్‌ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version