NTV Telugu Site icon

CM Chandrababu: రాజ్‌భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్‌, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..

Cbn

Cbn

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్, మాజీ రాష్ట్రపతిలతో చర్చించారు సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ‌ సమావేశాల తదనంతర పరిణామాలుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.. అమరావతి అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు..

Read Also: Minister Anagani Satya Prasad: జగన్‌కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందే.. మంత్రి సెటైర్లు..

మరోవైపు.. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్.. ఢిల్లీ నుండి విజయవాడ చేరుకోగానే నేరుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బంగ్లాకు వెళ్లిన పురంధేశ్వరి.. రామ్ నాధ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు.. పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది..

 

 

 

 

Show comments