CM Chandrababu: కర్నూలు జిల్లాలోని కలుగోట్ల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రౌడీలు మీ భూమిని 22A కింద పెట్టేస్తున్నారు.. ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టారు.. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు..హెలిపాడ్ కోసం ఆ పక్కన 10 ఎకరాల భూమి అడిగారు.. భూమి ఇవ్వమని చెబితే.. బలవంతంగా హెలిపాడ్ చేశారు.. 22ఏ కింద ఆ భూమిని ప్రభుత్వ భూమిని చేశారని ఆరోపించారు. 1956 నుంచి అన్ని రికార్డులు ఉన్నాయని ఆయన ఆధారాలు చూపుతున్నారు.. బలవంతంగా ప్రభుత్వ భూమిగా మార్చి అనుభవించారు.. వ్యక్తిగత స్వార్థం కోసం చేశారు.. పార్టీ ఆఫీసుకు వందల సంఖ్యలో భూముల సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
Read Also: US-Iran: మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్.. తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు ట్రంప్ వార్నింగ్
ఇక, మళ్లీ భూమిపై కన్ను వేయగుండా సర్వ హక్కులు ఇచ్చి సెక్యురిటీ హక్కులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి క్యూ ఆర్ కోడ్ పెట్టాం.. ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం.. ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పటికప్పుడే తెలుస్తుంది.. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాము…ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పటికప్పుడే తెలుస్తుంది…వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
అయితే, ప్రతి నెల 9వ తేదీన భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను వస్తాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడమే నా ధ్యేయం.. పట్టాదారు పుస్తకాల తో పారదర్శకత వస్తుంది.. కర్నూలు జిల్లాలో 8,745 మందికి కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం.. 37 లక్షల 40 వేలు పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయ్యాయి.. నూటికి నూరు శాతం పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. జనవరిలో ప్రారంభించి డిసెంబర్ వరకు భూమికి భద్రత ఇచ్చే పనిలో ఉంటా.. భూముల విషయంలో కొట్టుకోవద్దు.. అర సెంటు కోసం అన్నదమ్ములు, తల్లికొడుకులు కొట్టుకుంటున్నారు.. వారసత్వంగా వచ్చే భూమికి కొత్తగా మ్యూటేషన్ చేసుకోవాలంటే 100 రూపాయలు చెల్లిస్తే చాలు అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
