Site icon NTV Telugu

CM Chandrababu: భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి… ఇక ఆయనే చూసుకుంటారు..

Babu

Babu

CM Chandrababu: మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనే బాధ.. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోనున్న వేళ.. ట్విట్టర్‌ (ఎక్స్‌)లో స్పందించిన ఆయన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే, ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే జగన్ తిరుమల ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు.

Read Also: Physical Harassment: విద్యార్థినులకు హెచ్‌ఎం లైంగిక వేధింపులు.. బ్లూ ఫిల్మ్‌ చూపిస్తూ..!

జగన్‌కు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా.. కానీ, సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు.. అది అడిగితే బూతులు తిట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రథం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుందని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని పేర్కొన్నారు.. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్ట్‌ కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం.. అంటూ ట్వీట్‌చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

https://x.com/ncbn/status/1838428384038187287

Exit mobile version